సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఇటీవల తెలుగు రాష్ట్రాలలో రోడ్డు ప్రమాదాలు రికార్డు స్థాయిలో ప్రతి రోజు ఒక సీజన్ మాదిరిగా విచిత్రంగా జరుగుతూనే ఉన్నాయి. మీడియా కూడా ప్రజలు ప్రయాణాలంటే ప్రజలు భయపడతారని వాటిని తగ్గిస్తూ రాస్తుంది. ప్రతి రోజు బస్సులు బోల్తా కొట్టడం తగలబడి పోవడం మరో ప్రక్క యువకులు కూడా బైక్ లపై మీతిమిరిన వేగంతో వాహనాలు నడుపుతూ కోరి ప్రమాదాలకు తదుపరి మరణాలకు గురవుతున్నారు. వారి కుటుంబ సబ్యులకు క్షోభ మిగులుస్తున్నారు. ఈనేపథ్యంలో..నేడు, మంగళవారం ఉయ్యూరు- మచిలీపట్నం జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గండిగుంట సమీపంలో రోడ్డు ఫై వేగంగా వస్తున్నా కారు అదుపుతప్పడంతో అందులో ఉన్న నలుగురు యువకులు దుర్మరణం చెందారు.కారులో ఉన్న ఎయిర్ బాగ్స్ ఓపెన్ అయినా కూడా వారి ప్రాణాలు దక్కలేకపోవడం విశేషం. మృతులు కుందేరు గ్రామానికి చెందిన చింతయ్య(17), రాకేష్ బాబు(24), ప్రిన్స్ (24)లుగా గుర్తించారు. అయితే ఈ ప్రమాదంలో మరోకరికి తీవ్ర గాయాలు కాగా ఆస్పత్రికి తరలించారు.అతను అక్కడ మరణించినట్లు తాజా సమాచారం.
