సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఇటీవల హెచ్చుతగ్గులు నమోదు చేస్తున్న బంగారం ధరలు నేటి గురువారం భారీ పెరుగుదల రేట్లను ను నమోదు చేశాయి. నేటి ఉదయం తెలుగు రాష్ట్రాలలో (హైదరాబాద్, విజయవాడ, విశాఖ పట్నంలలో) బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ.2,290 పెరిగి రూ.1,27,800లకు (Gold Rate ) చేరింది. 22 క్యారెట్ల 10గ్రాముల పసిడి రూ.2,100 ఎగబాకి రూ.1,17,150గా నమోదైంది. అటు కేజీ వెండి రేట్లు తెలుగు రాష్ట్రాలలో ఒక్కసారిగా రూ.9000 పెరిగి.. రూ.1,82,000లకు చేరింది. ఇక ఢిల్లీలో కిలో వెండి రూ.10,000 పెరిగి ధర రూ.1,72,000గా ఉంది.
