సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఇంకో రెండు నెలల్లో గోదావరి జిల్లాలో సంక్రాంతి పండగ సందడి ఉండనుంది. ఇంటి ముందు రంగవల్లులు, కోడిపందేలు, గంగిరెద్దుల ఆటలతో 5రోజుల పండగ కోలాహలం ఏర్పడనుంది. కుటుంబ సభ్యులతో కలిసి సంక్రాంతి పండుగను జరుపుకోవడానికి హైదరాబాద్, బెంగళూరులో నివసించే తెలుగువాళ్లందరూ సొంతూర్లకు ప్రయాణం కట్టడం ఆనవాయితీగా వస్తోంది. సంక్రాంతికి ఇంటికి వెళ్లాలనుకునే వారికోసం పండగ తేదీలకు సరిగ్గా 60 రోజుల ముందు IRCTC వెబ్సైట్ లో టికెట్లు అందుబాటులోకి రానున్నాయి. ప్రత్యేక రైళ్ల కోసం ఎదురుచూడకుండా ఈ 60 రోజుల గడువును ఉపయోగించుకుని అడ్వాన్స్డ్ టికెట్ బుకింగ్ చేసుకోవడం వల్ల ఏపీకి వెళ్లే రైళ్లల్లో బెర్తులను సులభంగా పొందవచ్చు. అలాగనీ ప్రైవేట్ బస్సుల మీద ఆధారపడితే ను ఛార్జీల రూపంలో. కనీస టికెట్ 3,000 రూపాయల పైమాటే ఉండొచ్చు.. ప్రయాణ సుఖం రైలుతో పోలిస్తే బస్సు చాల తక్కువ. సంక్రాంతి పండగకు రైలు టికెట్ల బుకింగ్ నేటి నుండి (ఈ నెల 13 నుంచి) ప్రారంభమౌతుంది. జనవరి 12వ తేదీ టికెట్స్ అందుబాటులో ఉన్నాయి.ఇక చూసుకోండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *