సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం మెంటేవారి తోటలో గ్రంధి శ్యామ్ శివరాజ్ అధ్వర్యంలో గత బుధవారం రాత్రి శబరిమల అయ్యప్ప గుడిని తలపించేలా ఏర్పాటు చేసిన భారీ సెట్ సమక్షంలో .. అయ్యప్ప స్వాముల పడిపూజ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. స్థానిక ఎమ్మెల్యే పులపర్తి అంజిబాబు పూజ కార్యక్రమాలతో ప్రారంభించారు. స్వామి అయ్యప్ప, శరణం అయ్యప్ప, మణికంఠ మందారం గురుస్వాములు బంగారమంటూ కరిమళవాసుడు అయ్యప్ప స్వామిని కొలుస్తామని, భక్తిశ్రద్ద లతో అయ్యప్ప స్వాముల పడిపూజ నిర్వహించడం శుభ పరిణామమని అన్నారు. అనంతరం అయ్యప్ప స్వాములు స్వామివారిని భక్తి శ్రద్ధలతో కొలుస్తూ తీర్థ ప్రసాదాలు, నైవేధ్యాలు సమర్పించారు. అభిషేకాలు, మంగళ హారతులు, పాటలు పాడుతూ భక్తి పారవశ్యంలో మునిగిపోయారు. కార్యక్రమంలో ఏపీఐఐసీ డైరెక్టర్ చెనమల్ల చంద్రశేఖర్, మెంటే మనోజ్, తోట సురేష్, కారుమూరి సత్యనారాయణ మూర్తి, కూటమి నాయకులు, అయ్యప్ప స్వాములు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *