సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భారత సినీ పరిశ్రమ కు ‘రియల్’ లెజెండ్.. స్వర్గీయ సూపర్ స్టార్ కృష్ణ వర్ధంతి నేపథ్యంలో తెలుగు రాష్ట్రాలలో దేశవిదేశాలలో ఉన్న కృష్ణ, మహేష్ బాబు కోట్లాది అభిమానులు అన్నసమారాధనలు, పేదలకు వస్త్ర దానాలు రక్త దానాలతో సంక్షేమ కార్యక్రమాలతో ఆయన విగ్రహాలకు పుష్పమాలలు తో నివాళ్లు అర్పించారు. భీమవరంలో కూడా స్థానిక ఎడ్వార్డ్ ట్యాంక్ వద్ద ఉన్న సూపర్ స్టార్ కృష్ణ విగ్రహానికి పుష్పమాలలు వేసి అభిమానులు ఘన నివాళ్లు అర్పించి ప్రజా సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారు. ఇక మాజీ సీఎం జగన్ పోస్ట్ పెట్టారు. అందులో.. తెలుగు సినీ పరిశ్రమకు నూతన పంథాలు చూపించి, కోట్లాది మంది అభిమానాన్ని చూరగొన్న గొప్ప నటుడు పద్మభూషణ్ సూపర్ స్టార్ కృష్ణ గారు. ఎప్పుడూ కొత్తదనాన్ని అన్వేషించిన ప్రయోగశీలి ఆయన. తెలుగు సినీ పరిశ్రమలో ఎంతోమందిని ఆదుకున్న గొప్ప మానవతావాది. కృష్ణ గారి వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు.. అన్నారు.
