సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: విజయవాడ-సింగపూర్‌ విమాన సర్వీసు గత శనివారం పునః ప్రారంభం అయ్యింది. కేంద్రంలో టీడీపీ మంత్రి రామ్మోహన్నాయుడు చొరవతో గన్నవరం ఎయిర్ పోర్ట్ నుండి అంతర్జాతీయ సర్వీసు మొదలు కావడంపై అన్ని వర్గాల వారు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వారంలో మంగళ, గురు, శనివారాల్లో రాకపోకలు సాగించే ఈ సర్వీసును ప్రభుత్వవిప్‌, ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు ప్రారంభించారు. ఆయన ఇండిగో విమానానికి జెండా ఊపి సింగపూర్‌కు ప్రారంభించారు. శనివారం ఉదయం 7.30 గంటలకు 140 మంది ప్రయాణికులతో ఈ విమానం ఇక్కడికి వచ్చింది. అనంతరం 10.30 గంటలకు 123 మంది ప్రయాణికులతో సింగపూర్‌ వెళ్లింది. గత వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల గతంలో విజయవాడ ఎయిర్‌పోర్టుకు వచ్చే విమానాల సంఖ్య తగ్గిందని, ప్రస్తుతం 45 విమానాలు తిరుగుతున్నాయని.కూటమి హయాంలో 50 శాతం విమానాలు పెరిగాయని చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *