సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నేడు, సోమవారం భారతీయ స్టాక్ మార్కెట్ లో సూచీలు లాభాలతో ఈ వారంను ప్రారంభించాయి అంతర్జాతీయంగా సానుకూల సంకేతాలు కూడా సూచీలకు మద్దతుగా నిలవడంంతో ప్రస్తుతం సెన్సెక్స్, నిఫ్టీ లాభాల్లో కదలాడుతున్నాయి. (Indian stock ) గత శుక్రవారం సెషన్ ముగింపు (84, 562)తో పోల్చుకుంటే నేటి సోమవారం ఉదయం దాదాపు 150 పాయింట్ల లాభంతో మొదలైన సెన్సెక్స్ అదే ట్రెండ్‌ను కొనసాగిస్తోంది. ప్రస్తుతం ఉదయం 9:45 గంటల సమయంలో సెన్సెక్స్ 254 పాయింట్ల లాభంతో 84, 817 వద్ద కొనసాగుతోంది. మరో వైపు నిఫ్టీ కూడా సెన్సెక్స్ బాటలోనే సాగుతోంది. ప్రస్తుతానికి 58 పాయింట్ల లాభంతో 25, 967 వద్ద కొనసాగుతోంది (stock market ).నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ 345 పాయింట్ల లాభంతో ఉంది. బ్యాంక్ నిఫ్టీ 367 పాయింట్ల లాభంతో కొనసాగుతోంది. డాలర్‌తో పోల్చుకుంటే తాజగా రూపాయి మారకం విలువ 88.72గా ఉంది.
