సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: సంచలనానికి మరో పేరు రాంగోపాల్ వర్మ.. మేడ్ ఇన్ భీమవరం.. ఇండియన్ సినిమా కు శివ, క్షణ క్షణం,రంగీలా , కంపెనీ, సత్య, రక్త చరిత్ర ,D , సర్కార్ సిరీస్, వంటి సినిమాతో దర్శకుడుగా, మణిరత్నంతో కలసి దొంగ..దొంగ, దిల్ సే ,సినిమాలు తో పాన్ ఇండియా సినిమా ను ఒక ఆట ఆడుకున్నాడు. తానే నిర్మాతగా గులాబీ, మని, జేమ్స్ సినిమా లతో సూపర్ డూపర్ హిట్స్ తో కొత్త దిక్చుచి గా నిలచిన రాంగోపాల్ వర్మ సినిమాలు మోహన్ బాబు ‘రౌడీ’ హిట్ తరువాత.. ఇప్పుడు ఎవరూ పట్టించుకోవట్లేదు. కానీ ఆర్జీవీ రేంజ్ ఎప్పటికి మారదు, సినిమా పరంగా శివ సినిమా రీ రిలీజ్ ఆయన స్థాయిని మరోసారి నిరుపించింది. శివ సినిమా 1989 లో రిలీజయింది. అప్పట్లో ఈ సినిమాని 75 లక్షల బడ్జెట్ తో తీయగా తెలుగులో 4 కోట్లు కలెక్ట్ చేసింది. అప్పట్లో ఈ సినిమానే నాగార్జున సినిమాలలో టాపర్ గా నిలిచింది.అయితే లైఫ్ టైంలో వచ్చిన ఈ కలెక్షన్స్ అన్ని35ఏళ్ళ తరువాత ఇప్పుడు రీ రిలీజ్ లో బద్దలు కొట్టేసారు. శివ సినిమా ఆధునిక సౌండ్ హంగులతో ..4K రీ రిలీజ్ లో కేవలం మూడు రోజుల్లోనే 4.75 కోట్ల గ్రాస్ సాధించింది. ఇంకా ఈ సినిమా థియేటర్స్ లో నడుస్తుంది. 5 కోట్ల రౌండ్ ఫిగర్ అవుతుందని అంచనా వేస్తున్నారు. ఇదికదా అసలు మజా

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *