సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: కోట్ల రూపాయలు రెమునేషన్స్ హీరోలకు కట్టబెట్టి భారీ బడ్జెట్ సినిమాలు అన్న మిషతో.. కోర్టులు అభ్యన్తరాలు పెడుతున్న కూడా రాష్ట్ర ప్రభుత్వాల అండతో టికెట్స్ రేట్లు భారీగా పెంచేసి (ఒక్క టికెట్ 1500 రూ .. 700.. 350.. ఏమిటి? ఈ రేట్లు?) ప్రజలను హీరోల అభిమానులను, బహిరంగంగా దోచుకొంటున్న సినీ నిర్మాతలకు, అగ్ర హీరోలకు షాక్ ఇస్తున్న ‘ఐ బొమ్మ రవి‘ ఇటీవల అరెస్ట్ కావడం జరిగింది. రవి కూడా పైరసీ సినిమాలతో బెట్టింగ్ యాప్ ల ప్రమోషన్స్ చేస్తున్నాడు.. అయితే_ ఐ బొమ్మ ను మూసివేయించడంతో అతనికి సోషల్ మీడియాలో ప్రజల నుండి యూత్ నుండి అనూహ్య మద్దతు రావడం జరిగింది. అది కాక అతను విడాకులు తీసుకొంటున్న భార్య వల్ల పోలీసులకు పట్టుబడ్డాడని తెలియడం అందరిలో సానుభూతి పెంచుతుంటే.. మరో ప్రక్కఅతను ముందస్తు జాగ్రత్తలతో.. అతడి వద్ద లభించిన సెల్‌ఫోన్‌లో కేవలం ఫుడ్‌ డెలివరీ బాయ్స్‌ నంబర్లు మాత్రమే ఉండటం పోలీసులను ఆశ్చర్యపరిచింది. కరేబియన్ దేశానికీ చెందిన పౌరసత్వం కలిగిన మేధావిగా అందరికి షాక్ ఇచ్చాడు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ కేసు ఇంకా కొనసాగుతున్న తరుణంలో అందరికి షాక్ ఇస్తూ ఆన్‌లైన్‌లో కొత్తగా మరో పైరసీ సైట్ ‘ఐబొమ్మ వన్’ అనే సైట్ ప్రత్యక్షమైంది. అందులోనూ కొత్త సినిమాలు కనిపిస్తున్నాయి. కొత్తగా ప్రత్యక్షమైన ఐబొమ్మ వన్‌(Ibomma One)‌లో ఏదైనా సినిమాను క్లిక్ చేస్తే నేరుగా ‘మూవీ రూల్జ్’కు రీడైరెక్ట్‌ అవుతోంది. ఐబొమ్మ ఎకో సిస్టమ్‌లో 65 మిర్రర్ వెబ్‌సైట్లు ఉన్నాయని, అందులో ఐబొమ్మ వన్‌ను ప్రచారంలోకి తెచ్చి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. ఐ బొమ్మకథ ముగియలేదు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *