సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan ) హైదరాబాద్ లోని నాంపల్లి సీబీఐ కోర్టుకు (Nampally CBI Court) వచ్చారు. దాదాపు ఆరు సంవత్సరాల తరువాత వ్యక్తిగతంగా జగన్ విచారణకు హాజరయ్యారు. కేవలం ఐదు నిమిషాలు మాత్రమే జగన్ కోర్టు హాల్‌లో కూర్చున్నారు. న్యాయమూర్తి ముందు హాజరయ్యారు. ఆపై జగన్ వ్యక్తిగత హాజరును న్యాయస్థానం రికార్డు చేసింది. అటెండెన్స్ పూర్తి అయిన తరువాత కోర్టు నుండి జగన్ బయటకు వెళ్లిపోయారు. విమాన ఆశ్రయంలో దిగిన తదుపరి వేలాది తెలంగాణ అభిమానులతో జై జగన్ నినాదాలతో దద్దరిల్లింది. వారికీ అభివాదం చేసుకొంటు రోడ్డుల కిరువైపులా నిలుచున్నా అభిమానులకు అభివాదం చేసుకొంటూ జగన్ కోర్ట్ కు వెళ్లి కేవలం 10 నిమిషాలలో బయటకు వచ్చారు. నాంపల్లి కోర్ట్ ఆవరణ పరిసరప్రాంతాలు అన్ని జగన్ అభిమానులతో నిండిపోయాయి. తదుపరి తల్లి విజయమ్మని కలవడానికి లోటస్ ఫాండ్ కు వెళ్లి, తదుపరి విమానాశ్రయానికి వెళ్లి బెంగుళూర్ పయనం అయ్యారు. హైదరాబాద్ లో ఎక్కడ చుసిన జగన్ అభిమాన గణం దూసుకొని వస్తూనే ఉన్నారు. ప్రభుత్వం జగన్ కు దారి పొడవున ప్రతిష్ఠమైన పోలీస్ భద్రత ను కలిపించింది.
