సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పట్టణంలోని డీ.ఎన్.ఆర్ ఇంజనీరింగ్ కళాశాల లో చివరి సంవత్సరం చదువుతున్న ఇద్దరు బి.టెక్ విద్యార్థినులుకు (కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ ) ప్రముఖ గ్లోబల్ ఐటి దిగ్గజం ఇన్ఫోసిస్ లిమిటెడ్ నిర్వహించిన క్యాంపస్ రిక్రూట్మెంట్ ప్రక్రియలో 2026 సంవత్సరానికి ఎంపికైనట్లు కళాశాల సెక్రటరీ గాదిరాజు సత్యనారాయణ రాజు (బాబు) నేడు, గురువారం తెలిపారు ఎంపికైన విద్యార్థులు: అట్టిలి లక్ష్మి చేతన మరియు పట్టాపు శ్రావణి నాగ మహాలక్ష్మి లను అభినందించారు. వీరు తమ బి.టెక్ డిగ్రీని 2026 మేలో పూర్తి చేసిన తరువాత ‘సిస్టమ్ ఇంజనీర్’గా సంస్థలో చేరనున్నారు. కళాశాల ప్రెసిడెంట్ జి.వి. నరసింహరాజు మాట్లాడుతూ,”మన విద్యార్థులు ఇన్ఫోసిస్ వంటి ప్రపంచ స్థాయి కంపెనీలో ఎంపిక కావడం గొప్ప గర్వకారణం అన్నారు.
