సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఎప్పుడు రద్దీగా ఉండే భీమవరం బస్టాండ్ నందు ఈనెల 17వ తేదీన మధ్యాహ్నం ఒంటిగంటన్నర జరిగిన బంగారం దొంగతనం కేసును 48 గంటల వ్యవధిలో ఛేదించిన వన్ టౌన్ పోలీసు యంత్రాంగంను నేడు, గురువారం పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మి అభినందించారు. ఈ సందర్భముగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ..భీమవరం టిడికో లో నివాసం ఉండే కణితి ఆంజనేయ ప్రసాద్ తాను పనిచేస్తున్న బంగారు నగల తయారీ దుకాణం నుండి యజమాని ఆదేశాల మేరకు నరసాపురంలోని జైన్ గోల్డ్ షాప్‌కు డెలివరీ ఇవ్వడానికి నరసాపురం బస్సు ఎక్కుతున్నపుడు అతనిని గమనించిన నూజివీడు, కొత్తపేటకు కు చెందిన బంకురు కుమార్,మరియు మలుగుమాటి సుభాష్, అనే ఇద్దరు వ్యక్తులు అతని వద్ద నుండి లాఘవంగా 15 లక్షల రూపాయల విలువగల 135 గ్రాముల బంగారు ఆభరణాల చోరీ జరిగిందని స్థానిక వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు కాగా .. వెంటనే స్వాందించిన పోలీసులు ఆ దొంగతనానికి పాల్బడిన ఇద్దరు నిందితులను సీసీ కెమెరాల ఫుటేజీ ఆధారంగా విస్తృత గాలింపు చర్యల ఫలితంగా 19-11-2025 న మధ్యాహ్నం 02:00 గంటల సమయంలో భీమవరం రైల్వే జంక్షన్ పరిధిలో ముద్దాయిల కదలికలను గుర్తించి, ఇద్దరినీ అరెస్టు చేసి, వారి వద్ద నుండి దొంగిలించిన మొత్తం బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. అరెస్ట్ చేసి, వారి వద్ద నుండి మొత్తం చోరీ సొత్తును (బంగారు వడ్డాణము-125 గ్రాములు.మరియు 6 బంగారు లాకెట్స్ -10 గ్రాములు.స్వాధీనం చేసుకున్నతెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *