సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఏపీలో ఇప్పటిలో బస్సు ప్రమాదాలు ఆగేలా లేవు. చాల విచిత్రంగా గత నెలరోజులుగా ఎడతెరపి లేకుండా రోడ్డు ప్రమాదాలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజగా నేడు, శుక్రవారం ఉదయం ఉమ్మడి నెల్లూరు జిల్లా పెళ్లకూరు మండలం దొడ్ల వారి మిట్ట జాతీయ రహదారిపై ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు తెల్లవారుజామున బోల్తా పడింది. ఈ రోజు ఉదయం విజయవాడ నుంచి బెంగుళూరుకు వెళుతుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదంలో ఆరుగురు ప్రయాణికులకు తీవ్ర గాయాలు అయ్యి పరిస్థితి విషమంగా ఉందని సమాచారం. .అదే రహదారిపై వెళ్తున్న వాహనదారులు వెంటనే స్పందించి.. పోలీసులతోపాటు 108కి సమాచారం అందించారు. డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే ప్రమాదం చోటు చేసుకుందంటున్న ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. ఈ ప్రమాద సమయంలో బస్సులో 21 మంది ప్రయాణికులు ఉన్నారని ఎస్ఐ నాగరాజు చెప్పారు. ఈ బస్సులోని ప్రయాణికులను గమ్యస్థానానికి చేర్చేందుకు ప్రైవేట్ ట్రావెల్స్ యాజమాన్యం చర్యలు చేపట్టింది.
