సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భారతదేశ ‘ఉక్కు మనిషి’గా ఖ్యాతి గాంచిన స్వర్గీయ సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి మాసోత్సవాల సందర్భంగా భీమవరం డియన్ ఆర్ కళాశాల రామకృష్ణ సభామండపంలో జయంతి వేడుకల సభలో నేడు, సోమవారం కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ ముఖ్య అతిధిగా పాల్గొని, విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. స్వాత్రంతం అనంతరం భారత దేశంలో 520 పైగా స్వాత్రంతంగా ఉన్న సంస్థానాలు విలీనం అయ్యాయంటే, నిజాం పాలనలోని ఇప్పటి 4రాష్ట్రాలకు విస్తరించిన విశాల తెలంగాణ ప్రాంతం హైదరాబాద్ సంస్థానం దేశంలో విలీనం అయ్యాయంటే.. సర్దార్ పటేల్ ప్యూహం, ముందుచూపు సాహసోపేత నిర్ణయాలు కారణమని అటువంటి స్ఫూర్తి మనమందరం పెంచుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో DNR పాలకవర్గ వైస్ ప్రెసిడెంట్, గోకరాజు పాండురంగరాజు మరియు సభ్యులు, బీజేపీ నేత, కాగిత సురేంద్ర తదితరులు పాల్గొన్నారు. తదుపరి డిఎన్ఆర్ కళాశాల వద్ద నుండి విద్యారులు, నాయకులూ యూనిటీ మార్చ్ (ర్యాలీ ) ని కొత్త వంతెన వరకు నిర్వహించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *