సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: తెలుగు రాష్ట్రాలలో నేడు, సోమవారం శ్రీ సుబ్రమణ్య స్వామివారి షష్ఠి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ముఖ్యంగా పశ్చిమ గోదావరి జిల్లాల్లో ప్రసిద్ధి పొందిన అత్తిలి తో పాటు భీమవరం లోని స్థానిక శ్రీ రామాపురంలోని శ్రీ రామలింగేశ్వర దేవాలయాలలోని మహిమానిత శ్రీ వల్లీసమేత సుబ్రమణేశ్వర స్వామి వారిని నేడు తెల్లవారు జాము 3గంటల నుండి వేలాదిగా భక్తులు భారీ క్యూ లైన్లలో దర్శించుకొంటున్నారు. ఇక్కడ దశాబ్దాలుగా శ్రీ సుబ్రమణ్యేశ్వరుని దర్శించుకొని పాలాభిషేకాలు నిర్వహిస్తున్నారు. రేపు గురువారం సాయంత్రం 4 గంటల నుండి ఇక్కడ 25 అడుగుల రధోత్సవం హైలైట్ గా నిలవనుంది. 5రోజులు పాటు భారీ తీర్ధం బాలగోపాలానికి, యువతరానికి ప్రత్యేక ఆకర్షణ.. నూతన ఆలయ ఆవరణలో భక్తుల భదత్ర లో భాగంగా పోలీస్ పికెట్ ఏర్పాటు చేసి పిర్యాదులు నమోదు కేంద్రాన్ని ఏర్పాటు చేసారు. పలు దేవాలయంలలో విశేషంగా భక్తులు దర్శనాలు చేసుకొని స్వామివారికి పూలు,పండ్లు, వెండి పడగలు సమర్పించారు. ముఖ్యంగా గునుపూడి పంచరామం లోను, శ్రీ భీమేశ్వర స్వామి దేవాలయంలోనూ , మారుతి సెంటర్ లోని శ్రీ నాగేంద్ర స్వామి, సిగ్మా ఆఫీస్ వద్ద శ్రీ వీరభద్ర స్వామివారి దేవాలయం వద్ద భక్తుల సందడిగా ఉంది.
