సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఇటీవల కాలంలో డిజిటల్ అరెస్ట్ అంటూ ఎందరినో దోచుకొంటున్న అంతర్జాతీయ డిజిటల్ సైబర్ ముఠా గుట్టును భీమవరం పోలీసులు ఛేదించడమే కాదు 13 మంది నిందితులను కూడా అరెస్ట్ చేసారు (Bhimavaram cyber crime ) జిల్లా ఎస్పీ నయీమ్ హస్మి, నేడు, గురువారం ఏర్పటు చేసిన మీడియా సమావేశంలో ఈ కేసు వివరాలు తెలిపి భీమవరం 2 టౌన్ మరియు , సైబర్ పోలీసులును అభినందించారు. వివరాలలోకి వెళ్ళితే.. స్థానికంగా ఉన్న రిటైర్డ్ ప్రొఫెసర్ శర్మకు సిమ్ కార్డు వచ్చిందని, సీబీఐ అధికారులమని ఇటీవల సైబర్ కేటుగాళ్లు ఫోన్ చేసి మీ . సిమ్ కార్డు తేడా ఉందని తాము సరి చేస్తామంటూ ఆయనకు తెలిపారు. తదుపరి మిమ్ములను డిజిటల్ అరెస్ట్(digital fraud) చేస్తున్నామని కూడా శర్మను బెదిరించారు.ఆయన భయపడి ఆధార్, బ్యాంక్ ఖాతా వివరాలను సైబర్ కేటుగాళ్లకు చెప్పేయడంతో శర్మ అకౌంట్ నుండి 13 రోజుల వ్యవధిలో ఆ ఖాతాలో ఉన్న మొత్తం రూ.78 లక్షలు సైబర్ ముఠా విడతలు విడతలుగా దోచేసింది. దీంతో బాధితుడు క్రైమ్ బ్రాంచ్ పోలీసులను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసిన భీమవరం రెండో పట్టణ పోలీసులు ఏడు బృందాలుగా శరవేగంగా దర్యాప్తు ప్రారంభించారు. ఈ క్రమంలో మొత్తం 14 మంది నిందితులుగా పోలీసులు( Bhimavaram police ) గుర్తించారు. 13 మందిని అరెస్టు చేయగా.. ప్రధాన సూత్రధారి రహతే జె నయన్ పరారీలో ఉన్నాడు. నిందితులు కార్డ్ డీల్ పద్ధతి ద్వారా భారతీయుల బ్యాంకు ఖాతాలను సేకరించి కాంబోడియాకు పంపుతున్నట్లు పోలీసులు గుర్తించారు.Bhimavaram cyber crime అక్కడి నుంచే బాధితులకు ఫోన్లు చేసి బెదిరిస్తున్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. నిందితుల నుంచి రూ. 42 లక్షల నగదు రికవరీ చేసిన పోలీసులు ఇంకా వివిధ బ్యాంకు ఖాతాల్లో రూ.19 లక్షల నగదు ఫ్రీజ్ చేశారు. ఈ ముఠా సభ్యులు కంబోడియా వెళ్లి అక్కడ ట్రైనింగ్ తీసుకున్నట్లు తెలుస్తుంది. అంతర్జాతీయ సిమ్ కార్డులతో కూడిన 15 సెల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
