సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం గునుపూడి లో వేంచేసియున్న పవిత్ర పంచారామ క్షేత్రం శ్రీ సోమేశ్వర జనార్థన స్వామి వార్ల దేవస్థానం నందు గ్రామస్తులు, భక్తులు, సేవకులు, దేవదాయ శాఖ అధికారుల సమక్షంలో నేడు, గురువారం ఉదయం గత 40 రోజులకు గాను భక్తులు సమర్పించిన హుండీలు తెరచి లెక్కించగా రూ.27,03,849/-లు, మరియు అన్నదానం హుండీ ద్వారా రూ.1,27,617/- ఆధాయం లభించింది. . ఈ లెక్కింపు కార్యక్రమంను ఎ. వి సత్యనారాయణ రాజు, పి.టి.గోవింద్ , యం.వి. రామ రాజు, కార్యనిర్వహణాధికార్లు మరియు ఆలయ ప్రధాన అర్చకులు సోమేశ్వర రావు మరియు ధర్మకర్తలి మండలి ఛైర్మన్ చింతలపాటి బంగార్రాజు మరియు సభ్యులు బి. సత్యప్రసాద్ ,బి. కృష్ణ వేణి, పి.లీల, పి.వి.రామకృష్ణ,యస్,ఎన్, లక్ష్మీ కుమారి ,వై. రమణ, పి. శ్యామ్ కుమార్,పి. జ్యోతిమయి,కె. విజయలక్ష్మి పాల్గొన్నారని దేవాలయ ఇఓ డి రామకృష్ణంరాజు తెలిపారు.
