సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఆంధ్ర ప్రదేశ్ కు గర్వకారణం అయిన ‘వైజాగ్’ డేటా సెంటర్ల హబ్‌గా మారనుంది. రాజకీయాలు ప్రక్కన పెట్టి చుస్తే.. గతంలో జగన్ సర్కార్ దూర దృష్టితో విశాఖ ను ఆర్థిక రాజధాని అని ప్రకటించి అక్కడ ప్రఖ్యాత సాఫ్ట్ వెర్, ఐటీ కంపెనీల స్థాపనకు ఆహ్వానం పలకడం, మౌలిక సదుపాయాలు క్రూయిజ్ షిప్ వంటి భారీ భవన నిర్మాణాలు ఏర్పాటు దానికి, తోడు ప్రస్తుత కూటమి సర్కార్ లో ‘ఐటి మంత్రి’ లోకేష్ కృషి కొనసాగింపుతో విశాఖ కు రాష్ట్రంలో యువతకు మంచి రోజులు వస్తున్నాయి. వైజాగ్ గ్లోబల్ డేటా సెంటర్‌గా మారిపోతుంది. విశాఖలో తొలి డేటా సెంటర్ ఏర్పాటుకు అదానీ గ్రూపు గత జగన్ ప్రభుత్వ హయాంలో శంకుస్థాపన చేసింది. మధురవాడ హిల్ నంబరు 4పై 170 ఎకరాల్లో 300 మెగావాట్ల డేటా సెంటర్ ఏర్పాటుకు వేల కోట్లు వెచ్చిస్తామని ప్రకటించింది. సింగపూర్ నుండి సముద్రం క్రింద నుండి కేబుల్స్ విశాఖ వరకు వెయ్యడానికి ఒప్పందం కూడా జరిగింది. దీనికి కొనసాగింపుగా లోకేష్ చొరవతో మరిన్ని సంస్థలు నగరంలో కృత్రిమ మేధ (ఏఐ)తో కూడిన హైపర్ స్కేల్ డేటా సెంటర్ల ఏర్పాటుకు మల్టీ నేషనల్ కంపెనీలు చేతులు కలిపి జాయింట్ వెంచర్‌గా ఏర్పడుతున్నాయి. అదానీ సహకారంతో గూగుల్ అమెరికా వెలుపల అతి పెద్ద పెట్టుబడి రూ.1.35 లక్షల కోట్లతో ఒక గిగావాట్ సామర్థ్యంతో ఏఐ హైపర్ స్కేల్ డేటా సెంటర్ ఏర్పాటుకు ముందుకొచ్చింది. తాజాగా రిలయన్స్ సంస్థ కూడా ఒక గిగావాట్ సామర్థ్యంతో ‘డిజిటల్ కనెక్షన్’ పేరుతో డేటా సెంటర్ ఏర్పాటు చేస్తామని పేర్కొంది. దీని కోసం రిలయన్స్, బ్రూక్‌ఫీల్డ్, డిజిటల్ రియాల్టీ అనే మూడు సంస్థలు జాయింట్ వెంచర్‌గా ఏర్పడ్డాయి. వీరికి ప్రభుత్వం 400 ఎకరాలు కేటాయించనుంది. ఇక సిఫీ టెక్నాలజీస్ సంస్థ గత నెలలోనే విశాఖలో 550 మెగావాట్ల సామర్థ్యంతో డేటా సెంటర్ల నిర్మాణానికి శంకుస్థాపనలు చేసింది. ఈ కంపెనీకి ప్రభుత్వం రెండుచోట్ల 31.6 ఎకరాలు కేటాయించింది. ఇందులో ఒక డేటా సెంటర్‌ను రుషికొండ ఐటీ పార్కులో 2027 నాటికే పూర్తి చేయాలని ఆ సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది. ఇంకా టిల్‌మేన్ గ్లోబల్ హోల్డింగ్స్’ సంస్థ 300 మె గావాట్లతో డేటా సెంటర్ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వంతో ఎంవోయూ చేసుకుంది. మరోవైపు ఎల్ అండ్ టీ కంపెనీ వైజాగ్లో 300 మెగావాట్ల సామర్థ్యం కలిగిన డేటా సెంటర్లను ఏర్పాటు చేస్తామని ఇప్పటికే ప్రకటించింది.
