సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరంలో ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం నేపథ్యంలో పలు చైతన్య కార్యక్రమాలు జరిగాయి. భీమవరం ప్రభుత్వ హాస్పటల్ లోని ART చైర్మెన్ డాక్టర్ గోవింద్ బాబు నేతృత్వంలో భీమవరం టౌన్ హాలులో డాక్టర్స్ తో మరియు జిల్లా మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్ మెంట్ వైద్య అధికారులుతో, లయన్స్ కార్యకర్తలతో , కళాకారులతో నేటి సోమవారం ఉదయం సమావేశం జరిగింది. అంతకు ముందు NSS యూనిట్ వారి ఆధ్వర్యంలో భీమవరం పుర విధుల గుండా వందలాది మ్దనితో చైతన్య ర్యాలీ , మానవ హారం నిర్వహించారు. తదుపరి టౌన్ హాలు లో జరిగిన సదస్సులో.. హెచ్ఐవీ బారిన పడుతున్న వారి సంఖ్య 2010తో పోలిస్తే 37 శాతం తగ్గిందని, ఎయిడ్స్‌ తో మరణిస్తున్నవారి సంఖ్య సగానికి తగ్గిందని లయన్స్ జిల్లా 2వ వైస్ గవర్నర్ ఆర్వీ సూర్యనారాయణ రాజు అన్నారు. వక్తలు మాట్లాడుతూ..ఎయిడ్స్ రాకుండా తీసుకోవలసిన జాగ్రత్తలు వచ్చాక తీసుకోవాలనిన వైద్య చికిత్సలు,బాధితులకు రక్షణ చట్టాలు వివరించారు. 70 మంది ఎయిడ్స్ బాధితులకు లయన్స్ క్లబ్ ద్వారా పౌష్ఠిక ఆహారం అందించారు. . ఈకార్యక్రమంలో సీనియర్ లయన్ వబిలిశెట్టి కనకరాజు,లయన్స్ క్లబ్ అధ్యక్ష, కార్యదర్శులు బొండా రాంబాబు, అల్లు తులసి ప్రసాద్ క్లబ్ కోశాధికారి కనగర్ల రామకృష్ణ, ప్రాజెక్ట్ కో ఆర్డినేటర్ పావిరాల రామ్మోహన్ రావు,గోపిశెట్టి మురళి,ఆరవ ప్రసాద్,బొండాడ కుమార్,నందమూరి రాజేష్,కట్రెడ్డి రాము, భట్టిప్రోలు శ్రీనివాసరావు,కారుమూరి నరసింహమూర్తి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *