సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: అమెరికా డాలర్‌తో పోల్చుకుంటే నేడు, మంగళవారం భారతీయ రూపాయి మారకం విలువ (రూ.90) రికార్డు కనిష్టానికి పడిపోవడం దేశీయ స్టాక్ మార్కెట్ లో వరుసగా రెండో రోజు కూడా నష్టాలు తప్పలేదు. అలాగే RBI వడ్డీ రేట్ల కోత ఇప్పట్లో ఉండదనే అంచనాలు, అంతర్జాతీయంగా ప్రతికూల సంకేతాలు, క్రూడ్ ఆయిల్ ధరలు పెరగడం సూచీలను మరింత నష్టాలలోకి తోశాయి, గత సెషన్ ముగింపు (85, 6416)తో పోల్చుకుంటే నేడు మంగళవారం ఉదయం దాదాపు 300 పాయింట్ల నష్టంతో మొదలైన సెన్సెక్స్ చివరకు 503 పాయింట్ల నష్టంతో 85, 138 వద్ద రోజును ముగించింది. మరో వైపు నిఫ్టీ కూడా సెన్సెక్స్ బాటలోనే కదలాడింది. చివరకు 143 పాయింట్ల నష్టంతో 26, 032 వద్ద స్థిరపడింది (stock market ).నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ 132 పాయింట్లు నష్టపోయింది. బ్యాంక్ నిఫ్టీ 407 పాయింట్లు కోల్పోయింది. డాలర్‌తో పోల్చుకుంటే రూపాయి మారకం విలువ 89.87గా ఉంది.
