సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఇటీవల అమెరికా సుంకాలు పెంపు తో ఆంధ్రప్రదేశ్ లో ఆక్వా రైతులు తమ ఉత్త్పతుల ఎగుమతులకు పడుతున్న ఇబ్బందులు ఫై భీమవరం కు చెందిన బీజేపీ ఎంపీ పాక సత్యనారాయణ నేడు, బుధవారం రాజ్యసభలో గళం విప్పారు. విదేశీ ఎగుమతులు తగ్గిన దృష్ట్యా ఆత్మనిర్భర్భారత్ పథకంలో మన ఆక్వా రైతుల కోసం రొయ్యలను స్థానిక మార్కెట్ పెంచాలని ప్రజల వినియోగానికి ప్రోత్సాహం కల్పించాలి అన్నారు. ముఖ్యంగా రొయ్యలు చేపల ఎగుమతులకు ఉన్న అవరోధాలను అధిగమించడానికి ఆయన కొన్ని సూచనలు చేశారు. ప్రస్తుతం మన ఆక్వా మార్కెట్ అంతర్జాతీయంగా75 శాతం వాటాతో గ్లోబల్ లీడర్ గా ఉందన్నారు. ఇందులో ఆంధ్రప్రదేశ్ నుంచి 70 శాతం వాటా ఉందన్నారు. అయితే అమెరికా వాణిజ్య ఆంక్షలు విధించిన నేపథ్యం లో సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి, ప్రజలు రోజువారి ఆహారంలో ఆక్వా ఉత్పత్తుల తినడం చాలా ఆరోగ్యకరమన్నారు. వీటిని తీసుకోవడం వల్ల శరీరానికి మంచి ప్రోటీన్ అందుతుందన్నారు. రోగ నిరోధక శక్తి కూడా ఉంటుందని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం సహకారంతో ప్రధానంగా రక్షణ శాఖలో సిఆర్పిఎఫ్, బిఎస్ఎఫ్ లాంటి డిఫెన్స్ విభాగంలో ఉన్న క్యాంటీన్లకు ఈ ఆక్వా ఉత్పత్తులను చేర్చాలని, దీనికి సంబంధించి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయాలని కోరారు.అలాగే విద్య శాఖకు సంబంధించి పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం పథకానికి, అంగన్వాడి విద్యార్థులకు పోషక ఆహారంలో భాగంగా ఆక్వా ఉత్పత్తులను అందించవచ్చు అన్నారు. మరొక వైపు ఆక్వా ఎగుమతుల సంక్షోభాన్ని తొలగించే పక్రియ వేగవంతం చెయ్యాలని పాక సత్యనారాయణ పెద్దల సభలో ప్రస్తావించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *