సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఏపీలోని శ్రీ సత్యసాయి జిల్లాలో పులేటిపల్లి గ్రామానికి చెందిన అమల,ఆంజనేయులు దంపతుల కుమార్తె స్పందన ధర్మవరంలోని ఓ ప్రైవేటు కాలేజీలో ఇంటర్మీడియట్ చదువుతోంది. ఇంటర్ చదువుతున్న ఓ విద్యార్థిని ఆత్మహత్యాయత్నానికి పాల్పడి ఆసుపత్రిలో కన్నుమూసిన హృదయ వికార ఘటన సంచలనం రేపింది. ప్రాధమిక వార్త సమాచారం ప్రకారం .. ఆమెను ధర్మవరంలోని మరో కాలేజీలో ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నా ఓ పలుకుబడి కుటుంబానికి చెందిన విద్యార్థి ఆమె బస్సులో కాలేజీకి వెళ్లివచ్చే క్రమంలో తరుచూ అసభ్యకరంగా వేధించేవాడు. అతడి ఆగడాలు ఎదిరించినందుకు ఇటీవల ఆమెపై విచక్షణారహితంగా బస్సులోనే 2సారులు విద్యార్థినిపై దాడి చేశాడు. దీంతో బాధిత విద్యార్థిని అతడిపై ధర్మవరం వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసేందుకు ప్రయత్నించింది. అయితే, ఘటన చెన్నేకొత్తపల్లి పరిధిలో జరిగిందని, అక్కడికి వెళ్లి ఫిర్యాదు చేయాలని పోలీసులు తెలిపారు. దీంతో, బాధిత విద్యార్థిని తన తల్లిదండ్రులతో కలిసి చెన్నెకొత్తపల్లి పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు వెళ్లింది. అయితే ఆమె ఫిర్యాదును పోలీసులు పట్టించుకోలేదు. పోలీసుల తీరుతో తీవ్ర మనస్తాపానికి గురైన ఆమె గత నవంబరు 26న ఉరివేసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించింది.. కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం ఆమెను ధర్మవరం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడ వారం రోజులు బాధపడుతూ తాజగా.. ఆమె ప్రాణాలు విడిచింది . రాజకీయ పలుకుబడి, పోలీసుల అలసత్వం కారణంగానే తమ బిడ్డ ప్రాణాలు కోల్పోయిందని విద్యార్థిని తల్లిదండ్రులు ఆరోపించారు. నన్ను కాపాడదండి అని దీనంగా వేడుకున్న సరే.. ఆ విద్యార్థిని రక్షించలేకపోయిన వ్యవస్థ సిగ్గుపడాలి..
