సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నేడు, గురువారం మాజీ సీఎం జగన్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఏపీలో అన్ని వర్గాల ప్రజల పరిస్థితి దిగజారిపోయిందని , ప్రజల పేరుతొ ప్రభుత్వం కోట్ల అప్పులు తేవడం తప్ప ప్రజలకి సంక్షేమం అందించడం లేదని, దౌర్జన్యాలు అక్రమాలు పెరిగాయని, మా పాలనలో పోలీస్ వ్యవస్థ దేశంలో నెంబర్ వన్ గా ఉంటె ఇప్పుడు ఆఖరి స్థానంలో నిలబెట్టారని, సేవ్ ఆంధ్రప్రదేశ్ అనేలా రాష్ట్రంలో పాలన ఉందని ఏపీలో రైతుల పరిస్థితి దారుణంగా ఉందన్నారు. వైసీపీ హయాంలో వ్యవసాయాన్ని పండగ చేశామని.. పండగలా ఉన్న వ్యవసాయాన్ని దండగలా ఈ ప్రభుత్వం మార్చిందని మండిపడ్డారు. ఈ 19 నెలల చంద్రబాబు పాలనలో 17 సార్లు ప్రకృతి వైఫరిత్యాలు వచ్చాయన్నారు. తుఫానుతో నష్టపోయిన రైతులకు ఒక్క పైసా రాలేదని అన్నారు. తుఫాను కంటే ముందే కొనాల్సిన పంటల కొనుగోలు చేయలేదని ఫైరయ్యారు. రూ.1,100 కోట్ల ఇన్‌పుట్ సబ్సిడీ బకాయిలు ఇవ్వలేదని ఆరోపించారు.రైతులకు హక్కుగా ఉన్న పంట బీమా పథకాన్ని రద్దు చేశారని.. కేజీ అరటిపండ్లు అర్ధ రూపాయంటే రైతులు ఎలా బతకాలని? ప్రశ్నించారు. తమ హయాంలో అరటి, చీని రైతుల కోసం ప్రత్యేక రైళ్లు ద్వారా . ఏపీ నుంచి ఢిల్లీ, ముంబైకి రైళ్లలో 3లక్షల టన్నులు ఎక్స్‌పోర్ట్ చేశామని తెలిపారు.త హయాంలో ఏర్పాటు చేసిన కోల్డ్ స్టోరేజీలను మూసేశారని.. ఈక్రాప్ వ్యవస్థను చంద్రబాబు భ్రష్టు పట్టించారని అన్నారు. తిరుమల పరకామణి వివాదం ఆశ్చర్యం కలిగించే కేసు అని .. అక్కడ హుండీ లెక్కింపులు పారదర్శకంగా ఉండాలని మా హయాంలోనే సిసి కెమెరాలు పెట్టించామని, పరకామణి కేసులో దొరికింది 9 డాలర్లు అని.. ప్రాయశ్చిత్తంగా రూ.14 కోట్ల ఆస్తులను టీటీడీకి ఇచ్చారని తెలిపారు. పరకామణి దొంగ.. జీయర్ స్వామి మఠంలో క్లర్క్‌గా పనిచేశారని ఆ మఠంఫై గౌరవంతో మెగా లోక్ అదాలత్‌లో కేసును పరిష్కరించారని అన్నారు. మళ్లీ కేసును తెరపైకి తెచ్చారని మండిపడ్డారు. ఇటీవల పరకామణి కేసు పట్టుకున్న వ్యక్తిని మరణించేలా చేశారన్నారు. స్వామివారి కానుకలు చోరీ చేస్తున్న దొంగను పట్టుకోవడం మా నేరమా? అంటూ జగన్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *