సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: పాఠశాలలు మన పిల్లలను తీర్చిదిద్దే దేవాలయాలని, విద్యార్థుల విషయంలో ఉపాధ్యాయులతో పాటు తల్లిదండ్రులూ బాధ్యత తీసుకోవాలని ఏమ్మెల్యే పులపర్తి అంజిబాబు అన్నారు. భీమవరం ఝాన్సీ లక్ష్మీ బాయి మున్సిపల్ హైస్కూల్లో నేడు శుక్రవారం 3.0 మెగా పేరెంట్స్ మీట్ నిర్వహించారు. ఎమ్మెల్యే అంజిబాబు మాట్లాడుతూ మగపిల్లల కంటే ఆడపిల్లలు ఎందులోనూ తక్కువ కాదని, తల్లిదండ్రులు ఇద్దర్నీ సమానంగా చూడాలనే ఉద్దేశంతోనే ఎంతమంది పిల్లలుంటే అంతమందికీ తల్లికి వందనం కూటమి ప్రభుత్వం ఇస్తుందని, రానున్న రోజుల్లో కార్పొరేటు దీటుగా ప్రభుత్వ బడులను తీర్చిదిద్దుతామని అన్నారు.విద్యకు ప్రభుత్వం పెద్ద పీట వేస్తుందని అన్నారు. అనంతరం ప్రతిభ చాటిన విద్యార్థులకు మెడల్స్ ను అందించారు. కార్యక్రమంలో హైస్కూల్ హెచ్ ఎం కృష్ణకుమారి, కృష్ణ బలిజ కార్పొరేషన్ చైర్మన్ గంటా త్రిమూర్తులు, ఇందుకూరి రామలింగరాజు, సత్యనారాయణ రాజు, కొప్పినిడి బాబీ, కారుమూరి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *