సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: విక్టరీ వెంకటేష్ హీరోగా భీమవరం బ్రాండ్ వెటకారంతో .. మాటల మాంత్రికుడు, అగ్ర దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas) కాంబినేషన్ లో ఫ్యామిలీ, కామిడీ. యాక్షన్ సినిమా ‘ఆదర్శ కుటుంబం హౌస్ నెంబర్ 47’‘ఏకే 47’ అనేది ట్యాగ్‌లైన్. హారికా అండ్ హాసినీ క్రియేషన్స్ పతాకంపై సినిమా విడుదల తేదీని శనివారం మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. నిజానికి ఈ సినిమా షూటింగ్ ఫై అనేక గాసిప్స్ వచ్చాయి. ఇటీవల యాక్షన్ కింగ్ అర్జున్ హీరోగా వచ్చిన ‘బ్లాస్ట్’ సినిమా సూపర్ హిట్ అయ్యి దక్షిణాది బాషలలో 50 కోట్లు పైగా సాధించడంతో అదే కథను ఈ సినిమా పోలి ఉండటంతో కధలో మార్పు చేస్తున్నారని ఈ ఏడాది సినిమా రిలీజ్ ఉండదని గాసిప్స్ వచ్చాయి. అయితే ‘ఆదర్శ కుటుంబం హౌస్ నెంబర్ 47’ ‘ఏకే 47’ గాంధీ జయంతి రోజు అక్టోబర్ 2న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేయబోతున్నట్లు మేకర్స్ ఓ పోస్టర్‌ను తాజాగా విడుదల చేశారు. వెంకీ సరసన ‘కెజియఫ్’, ‘హిట్ 3’ ఫేమ్ శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా నటిస్తోంది. ఇందులో ఇద్దరు పిల్లలకు తల్లిగా ఆమె కనిపిస్తుంది.. అలాగే ఈ పోస్టర్‌లో వెంకీ ఫ్యామిలీని రెండు డిఫరెంట్ ఫొటోలతో చూపించిన విధానం ..మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఫొటో ఒక వైపు, రిచ్ ఫ్యామిలీ మరోవైపు చూపిస్తూ.. మేకర్స్ వదిలిన ఈ పోస్టర్ ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. త్రివిక్రమ్ వెంకీ కాంబినేషన్ అంటే మరో మల్లేశ్వరి, నువ్వు నాకు నచ్చావ్ స్థాయి అంచనాలు ఉన్నాయి మరి..
