సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నేడు శనివారం భీమవరంలో 11 మందికి సుమారు 7 లక్షల ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) చెక్కులను కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ తన కార్యాలయంలో అందజేశారు. వివిధ అనారోగ్య కారణాలు, ఇతర ఇబ్బందులతో బాధపడుతూ ముఖ్యమంత్రి సహాయ నిధికి దరఖాస్తు చేసుకున్న వారికి ఈ నిధులు మంజూరయ్యాయి. ఆపదలో ఉన్న పేద ప్రజలను ఆదుకోవడంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఎల్లప్పుడూ ముందుంటుందని తెలిపారు. వైద్య చికిత్సల భారాన్ని భరించలేక ఇబ్బందులు పడుతున్న పేద మధ్యతరగతి కుటుంబాలకు ఈ సహాయం ఎంతో ఉపయోగకరంగా మారింది అని తెలిపారు. తమకు ఆర్థిక సహాయం అందేలా చొరవ తీసుకున్న కేంద్రమంత్రి శ్రీనివాస వర్మ కి బాధిత కుటుంబ సభ్యులు కృతఙ్ఞతలు తెలిపారు.
