సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఆంధ్ర ప్రదేశ్ లారీ ఓనర్స్ అసోసియేషన్ తాజగా, విజయవాడ కార్యాలయంలో సమావేశం అయ్యి ఈ నెల 9వ తేదీ అర్ధరాత్రి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా లారీ లలో గూడ్స్ రవాణా నిలిపివేస్తామన్నారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం పెంచిన టెస్టింగ్, ఫిట్నెస్ ఫీజులు తగ్గించాలని ఏపీ లారీ ఓనర్స్ అసోసియేషన్ డిమాండ్ చేసింది. 13 ఏళ్లు దాటిన వాహనాలపై ఫిట్నెస్ ఫీజులను పెంచే నోటిఫికేషన్ అమలు వెంటనే నిలిపివేయాలని డిమాం డ్ చేశారు,20 ఏళ్లు దాటిన పాత వాహనాల ఫీజు రూ 33వేల400కు పెంచారు. దీనివల్ల వేలాది లారీ యజమాను లు తీవ్రంగా నష్టపోతారన్నారు. ఈనెల 9న రాష్ట్రంలోని రైల్వే గూడ్స్ షెడ్లు , షిప్ యార్డు లలో గూడ్స్ రవాణా వాహనాలు నిలిపివేయడానికి కూడా సిద్ధంగా ఉన్నామన్నారు.
