సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: దేశచరిత్రలో ఎన్నడూ లేని విధంగా గత వారం రోజులుగా వందలాది ఇండిగో విమానాలు రద్దు కావడం విమాన ఆశ్రయాలు ప్రయాణికులతో నిండిపోయి అనుకున్న సమయానికి గమ్యానికి చేరలేక ఎందరో జీవితాలు సంక్షోభాలు ఎదుర్కోవడం, మిగతా ఎయిర్ లైన్స్ విమానాలు టికెట్ చార్జీలు మూడింతలు పెంచేసి ప్రయాణికులను దోచుకోవడం కేంద్రంలోని మోడీ సర్కర్ కు ఇబ్బందిగా మారింది. ఈఘటనలు కూడా రష్యా ప్రెసిడెంట్ పుతిన్ భారత్ పర్యటన నేపథ్యంలో జరగటం దేశానికీ ఉన్న క్రిడిట్ డామేజ్ అయ్యిందనే చెప్పాలి. దీనికంతటికి ప్రధాన కారణం దేశీయ విమాన శాఖ మంత్రి రామోహనాయుడి చేతకాని తనం, ముందు చూపు లేకపోవడం అని కొన్ని జాతీయ మీడియా ఛానెల్స్ మరియు రాష్ట్రంలో వైసీపీ నేతలు తీవ్ర స్థాయిలో దుమ్మెత్తి పోస్తున్నారు. ఇక ప్రధాని మోడీ టీడీపీ ఎంపీ,కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడి రాజీనామా కోరతారని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్నా నేపథ్యంలో.. నేడు, సోమవారం లోక్ సభలో మంత్రి రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ.. ఇండిగో అంతర్గత సమస్యల వల్లే ఈ సంక్షోభం తలెత్తిందని, ఎఫ్డీటీఎల్ అమల్లోకి వచ్చిన నెల వరకు సజావుగానే విమాన సర్వీసులు నడిచాయని గుర్తు చేశారు. డిసెంబర్ 3 నుంచే సమస్య మొదలైందన్నారు పైలట్ రోస్టర్, క్రూ సిబ్బంది సమస్యల వల్లే విమాన సర్వీసుల రద్దు అయ్యాయని , ఇకపై దేశంలో కేవలం 2 విమాన యాన సంస్థలు కాకుండా వీలైనన్ని ఎక్కువ విమాన సంస్థలను ప్రోత్సహిస్తామని , ప్రయాణికుల అసౌకర్యానికి తాను చింతిస్తున్నానని రామ్మోహన్ నాయుడు తెలిపారు
