సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: అమెరికా డాలర్‌తో పోల్చుకుంటే రూపాయి రోజు రోజుకూ క్షీణిస్తుండడంతో దిగుమతులపై తీవ్ర ప్రభావం పడుతోంది. ఈ నేపథ్యంలో స్టాక్ మార్కెట్ పై నెగిటివ్ ప్రభావం చూపుతోంది. ఇండిగో విమాన సంక్షోభం నేపథ్యంలో ఆ సంస్థల షేర్స్ కూడా దారుణంగా పడిపోయాయి. దీంతో ఈ వారాన్ని నేడు, సోమవారం దేశీయ సూచీలు నష్టాలతో ప్రారంభించాయి. అలాగే అంతర్జాతీయంగా ప్రతికూల సంకేతాలు కూడా ప్రస్తుతం సెన్సెక్స్, నిఫ్టీ నష్టాలకు కారణంగా కనబడుతున్నాయి. (Indian stock market).గత సెషన్ ముగింపు (85, 712)తో పోల్చుకుంటే సోమవారం ఉదయం దాదాపు 100 పాయింట్ల నష్టంతో మొదలైన సెన్సెక్స్ ఆ తర్వాత మరింత కిందకు దిగజారింది. ప్రస్తుతం ఉదయం10గంటల సమయంలో సెన్సెక్స్ 209 పాయింట్ల నష్టంతో 85, 502 వద్ద కొనసాగుతోంది. మరో వైపు నిఫ్టీ కూడా సెన్సెక్స్ బాటలోనే సాగుతోంది.బ్యాంక్ నిఫ్టీ 200 పాయింట్ల నష్టంతో కొనసాగుతోంది. నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ 42 పాయింట్ల నష్టంతో ఉంది. డాలర్‌తో పోల్చుకుంటే రూపాయి మారకం విలువ 90.08గా ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *