సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పురాధీశ్వరి శ్రీశ్రీశ్రీ మావుళ్ళమ్మ అమ్మవారిని నేడు, సోమవారం ఉదయం శంబాల ఎ మిస్టికల్ వరల్డ్ సినిమా యూనిట్ సభ్యులు ప్రముఖ నటుడు సాయికుమార్ తనయుడు యువ హీరో ఆది, హీరోయిన్ అర్చన అయ్యర్, నటులు ఇంద్రనీల్ అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ టీమ్కు పాలకోడేరు కోపరేటివ్ రురల్ బ్యాంకు చైర్మెన్ కొత్తపల్లి నాగరాజు నేతృత్వం వహించారు. వారందరికీ ఆలయ ప్రధానార్చకులు బ్రహ్మ శ్రీ మద్దిరాల మల్లిఖార్జున శర్మ ప్రత్యేక పూజలను నిర్వహించి ఆశీర్వచనం ప్రసాదాలు అందజేశారని ఆలయ సహాయ కమిషనర్ బుద్ధ మహాలక్ష్మి నగేష్ తెలిపారు. తదుపరి శంబాలా టీమ్ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో హీరో ఆది మాట్లాడుతూ.. తన కెరీర్ లోనే మంచి బిజినెస్ చేసిన చిత్రం శంబాలా అని ఈ సినిమా టీజర్ ను పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ లంచ్ చెయ్యడం తో సినిమాపై అంచనాలు బాగా పెరిగాయని ఈనెల 21న రిలీజ్ అవుతుందని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *