సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం ప్రకాశం చౌక్ లో నేడు సోమవారం నియోజకవర్గ వైసీపీ ఇంచార్జి చినమిల్లి వెంకటరాయుడు ఆధ్వర్యంలో శిబిరం ఏర్పాటు చేసి.. రాష్ట్రంలో చంద్రబాబు సర్కార్, గత జగన్ హయాంలో కట్టిన 17 వైద్య కళాశాలలను ప్రేవేటుకరణ చేస్తూ సామాన్య పేద విద్యార్థులకు వైద్య విద్య అందకుండా చేస్తుందని, వేల కోట్ల ఆస్తులను తనవర్గం వారికీ అప్పనంగా కట్టబెట్టే కుట్ర జరుగుతుందని యువత అడ్డుకోవాలని.. అధినేత జగన్ ఇచ్చిన పిలుపు మేరకు కోటి సంతకాల ఉద్యమంలో భాగంగా సంతకాల సేకరణ చెప్పటినట్లు.. ప్రకటించి సంతకాలు సేకరించారు. ఈ కార్యక్రమంలో భీమవరం ఎంపీపీ నరసింహరాజు , కామన నాగేశ్వర రావు, ఏ ఎస్ రాజు ఇతర వైసీపీ పార్టీ శ్రేణులు పాల్గొని రోడ్లపై వెళ్లేవారికి సమస్య వివరిస్తూ విశేషంగా సంతకాలు సేకరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *