సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ప్రెవేటు విద్య సంస్థల సిబ్బంది లేదా యాజమాన్యం లేదా ర్యాగింగ్ వేధింపులతో పలువురు విద్యార్థులు క్షణికావేశంలో ఆత్మహత్య యత్నాలు చేసుకోవడం ఎన్నో విషాదగాధలు చూస్తూనే ఉన్నాం. అయితే కారణాలు ఏవైనా అన్ని ఘటనలు వెలుగులోకి రావు.. తాజగా .. తిరుపతి అగరాల నారాయణ కాలేజీలో తాజగా విద్యార్థి మహీధర్‌రెడ్డి ఆత్మహత్య ప్రయత్నం సంచలనం రేపింది. ప్రాధమిక వార్త సమాచారం ప్రకారం.. చదువు పేరుతో కాలేజ్ యాజమాన్యం పెడుతున్న వేధింపులు భరించలేక ఆ విద్యార్థి కాలేజ్ మూడో అంతస్తు నుంచి దూకి ఆత్మ హత్య కు యత్నించాడు మహీదర్రెడ్డికి తలకు తీవ్రగాయాలయ్యాయి. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆ విద్యా ర్థి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.
