సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: పశ్చిమ గోదావరి జిల్లా రైతులకు కనీస మద్ధతు ధర చెల్లించి ఖరీఫ్ ధాన్యాన్ని కొనుగోలు జరిగేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని భీమవరం అగ్రికల్చర్ మార్కెట్ యార్డ్ వద్ద నేడు, బుధవారం .. రైతాంగ సమస్యలు పరిష్కారం కోరుతూ సీపీఐ, ఏపీ రైతు సంఘం రాష్ట్ర వ్యాపిత పిలుపుమేరకు రైతులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ దళారులు మిల్లర్లు చేస్తున్న మోసంతో బస్తాకు రైతు నాలుగైదొందల రూపాయలు నష్టపోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏభై లక్షల టన్నులు ధాన్యం కొనుగోలు చేస్తామని, ఆరు లక్షల డెబ్బై వేల కోట్ల సంచులు, బరకాలు సిద్దం చేశామని సర్కారు ప్రకటన క్షేత్ర స్థాయిలో జరగడంలేదని ఆయన విమర్శించారు. మొంధా తుఫాన్ 5,500 కోట్లు నష్షం జరిగితే కేంద్ర బృందం ఎన్యుమరేషన్ చేసి వెయ్యి కోట్ల రూపాయలే నష్టం అని తేల్చారని అది కూడా నేటికీ అందలేదని సిపిఐ జిల్లా కార్యదర్శి కోనాల భీమారావు ఇతర నేతలు డిమాండ్ చేశారు. అనంతరం అగ్రికల్చరల్ మార్కెట్ యార్డ్ సూపర్ వైజర్ కఠారి పెద్దిరాజు కు డిమాండ్స్ తో కూడిన వినతిపత్రాన్ని నాయకులు అందచేశారు. కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి వై.వి.ఆనంద్, సనపల శ్రీనివాసరావు, చెల్లబోయిన రంగారావు, కలిశెట్టి వెంకట్రావు, ఎం.సీతారాంప్రసాద్, సికిలే పుష్పకుమారి,తదితరులు పాల్గొన్నారు.
