సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: బాలకృష్ణ – బోయపాటి శ్రీను హ్యాట్రిక్ సూపర్ హిట్ సినిమాల తరువాత భారీ అంచనాలతో.. ఎట్టకేలకు అన్ని అవరోధాలు దాటుకొని .. సనాతన హిందూ ధర్మం గొప్పతనాన్ని చాటి చెప్పే ప్రయత్నంగా అఖండ 2 సినిమాప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక సినిమా కధ విషయానికి వస్తే...భారత దేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి చైనా చేస్తున్న కుట్రలు, టిబెట్ పై ఆ దేశం చేసిన ఆక్రమణ, నేపథ్యంలో.. అఖండ’ సినిమాకు ఎక్కడ శుభం కార్డు పడిందో అక్కడే ఈ కథ మొదలైంది. అరి వర్గాలను హతమార్చిన అఖండ రుద్ర (బాలకృష్ణ) తపస్సు చేయడానికి హిమాలయాలకు వెళ్ళిపోతాడు. ఇక్కడ మురళీకృష్ణ (బాలకృష్ణ ) ఎమ్మెల్యేగా ఎన్నికై ప్రజలకు సేవ చేస్తుంటాడు. అతని భార్య శరణ్య మరణించడంతో కూతురు జనని (హర్షాలీ మల్హోత్ర)ని, సైంటిస్ట్ ను చేస్తాడు. ఇదిలా ఉంటే… పీ.ఎం. పీఠంపై కన్నేసిన ప్రతిపక్ష నేత అజిత్ ఠాకూర్ (కబీర్ దుహాన్ సింగ్)…చైనా జనరల్ జంగ్లీ తో చేతులు కలుపుతాడు. కుట్రలో భాగంగా హిందువులను భయకంపితుకు చెయ్యడానికి . మహా కుంభమేళ లో పవిత్ర గంగాజలాన్ని కలుషితం చేసి తద్వారా ప్రజలు వైరస్ బారిన పడేలా పన్నాగం పన్నుతాడు..అయితే అఖండ, ప్రతిపక్ష నేత, చైనా జనరల్ చేసిన ప్రయత్నాలను అఖండ రుద్ర ఎలా అడ్డుకున్నాడు? ప్రధానికి ఎలా భరోసా ఇచ్చాడు అనేది మిగతా కథ. అయితే ఫస్ట్ హాఫ్ లోని ట్విస్ట్స్ లు ..సెకండ్ హాఫ్ లో మిస్ అయ్యాయి. కేవలం అఖండ జనని ని కాపాడం, కోసం తరుచు చేసే లాజిక్ కు అందని ఫైట్స్ తో వరుసగా శత్రువులసంహారం చెయ్యడమే లక్ష్యంగా ద్వితీయార్ధం సాగింది..హీరో బాలకృష్ణ రెండు పాత్రలకు సంపూర్ణ న్యాయం చేశాడు. అఖండ రుద్రగా తన నట విశ్వరూపాన్ని ప్రదర్శించాడు. అఖండ అంత కాకపోయిన డైలాగ్స్… ఈసారి కూడా బాగానే పేలాయి. మరీ ముఖ్యంగా కొన్ని పొలిటికల్ కూడా చొప్పించారు. .ఇందులో ‘బజరంగీ భాయీజాన్’ ఫేమ్ హర్షాల కీలకమైన జనని పాత్రను చక్కగా పోషించింది. సంయుక్త పాత్ర ఓ మాస్ సాంగ్, యాక్షన్ ఎపిసోడ్ కే పరిమితం అయ్యింది. ఆది పినిశెట్టి పోషించిన తాంత్రికుడి పాత్ర ద్వితీయార్థంలోనే ఎంట్రీ ఇస్తుంది. అయితే ఈ పాత్ర పెద్దగా రాణించలేదు. మెయిన్ విలన్స్ గా సాంగ్య, కబీర్ దుహాన్ సింగ్, ‘కల్కి’ ఫేమ్ శాశ్వత్ ఛటర్జీ చేశారు. ఇతర ప్రధాన పాత్రలను పూర్ణ, సర్వదమన్ బెనర్జీ, మురళీమోహన్, బాగానే పోషించారు. బోయపాటి శ్రీను చిన్న కొడుకు వర్షిత్ ఇందులో భక్త ప్రహ్లాదుడి పాత్రలోకనిపించడం గమనార్హం. ఈ చిత్రానికి బోయపాటి రాసిన సంభాషణలు, దర్శకత్వం షరా మామూలుగానే ఉంది.బాలయ్య అభిమానులకు పండుగ చెయ్యాలి అంతే .. దానికోసం ఎన్నో హద్దులు దాటాడు.గ్రాఫిక్స్ క్వాలిటీ లేదు. కుంభమేళా దృశ్యాలు బాగా వాడుకొన్నారు. ఇక తమన్ నేపథ్య సంగీతం ఎప్పటిలానే హైలైట్ గానిలచింది. ఒక్క మాటలో అఖండ 2 బాలకృష్ణ ఫ్యాన్స్ కు, యాక్షన్ సన్నివేశాలను ఇష్టపడే వారికి ‘అఖండ-2’ నచ్చుతుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *