సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ప్రపంచ ప్రఖ్యాత ‘ స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీ ‘2025 గ్లోబల్ ఏఐ వైబ్రెన్సీ టూల్’ తాజాగా విడుదల చేసిన నివేదిక ప్రకారం సాఫ్ట్ వేర్ రంగంలో ఏఐ (Artificial Intelligence) సాంకేతిక అభివృద్ధి, వినియోగంలో అంతర్జాతీయంగా భారత్ మూడో స్థానంలో ఉంది. గతంతో పోలిస్తే భారత్ నాలుగు స్థానాలు పైకి ఎగబాకింది. ఈ నివేది ప్రకారం.. ఏఐ పురోగతిలో అమెరికా 78.6 స్కోరుతో అగ్రస్థానంలో కొనసాగుతుంది. చైనా(36.95) రెండో స్థానంలో ఉండగా.. భారత్(21.59)తో మూడో స్థానానికి చేరింది. ఈ సూచీలో సౌత్ కొరియా(17.24), యునైటెడ్ కింగ్‌డమ్(16.64), సింగపూర్(16.43), స్పెయిన్(16.37), యూఏఈ(16.06), జపాన్(16.04) మన కంటే క్రిందనే ఉన్నాయి.
