సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఏపీ సీఎం చంద్రబాబు (CM Chandra babu) ఢిల్లీలో నేడు, శుక్రవారం పర్యటిస్తున్నారు. నేటి ఉదయం కేంద్ర జల శక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్‌తో (CR Patil) చంద్రబాబు భేటీ అయ్యారు. ఈ సమావేశంలో ఏపీ నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు కూడా పాల్గొన్నారు. ఏపీకి సంబంధించిన పోలవరం, బనకచర్ల నిర్మాణం నిధులు విడుదల ఆలస్యం నేపథ్యంలో వాటి నిర్మాణవేగాన్ని పెంచడానికి కేంద్రం సహకారం మరియు కొత్తగా చేపట్టేపలు నీటిపారుదల ప్రాజెక్టులపై చర్చించారు. పెండింగ్ అంశాలపై ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించాలని కోరారు. 2025 నుంచి 2026 ఆర్థిక సంవత్సరానికి జల్ జీవన్ మిషన్ అమలు కోసం ఏపీకి అదనంగా రూ.1,000 కోట్లు కేటాయించాలని విన్నవించారు.
