సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భారత్ సరిహద్దు దేశం బంగ్లాదేశ్ (bangladesh) లో గత అర్ధరాత్రి నుండి మరోసారి భారీ అల్లరులు చెలరేగాయి. పలు సంస్థల కార్యాలయాలు కు ఆందోళన కారులు రోడ్లపైకి నిప్పు పెట్టారు. కొద్దీ నెలలు క్రితం, అప్పటి, ప్రధాని షేక్ హసీనాకు వ్యతిరేకంగా జరిగిన భారీ విద్యార్థి ఉద్యమంలో, అక్కడి హిందువుల కుటుంబాలు ఆస్తులపై దాడులకు ఉసిగొల్పడంలో కీలక పాత్ర పోషించిన యువ నాయకుడు షరీఫ్ ఉస్మాన్ బిన్ హాదీ హత్యతో (sharif usman bin) బంగ్లాదేశ్ మరోసారి భగ్గుమంది. భారత్ కూడా తాజా పరిస్థితులపై అలర్ట్ అయ్యింది. అక్కడి హిందువులను బయటకు రావద్దని హెచ్చరించింది. విషయంలోకి వెళ్ళితే విద్యార్థి ఉద్య మం తో హసీనా ప్రభుత్వాన్ని గద్దె దిం చడం లో కీలక పాత్ర పోషించిన అతడి పార్టీని అక్కడి తాత్కాలిక ప్రభుత్వం గుర్తించకపోవడంతో స్వతంత్ర అభ్యర్థిగా అతడు.. ఢాకా-8 నియోజకవర్గం నుంచి బరిలోకి దిగారు.ఈ డిసెంబర్ 12న ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆటోలో వెళుతుండగా గుర్తుతెలియని వ్యక్తులు బైక్ ఫై వచ్చి అతనిపై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన హాదీని ఢాకా మెడికల్ కాలేజీ ఆసుపత్రికి తదుపరి సింగపూర్ ఆసుపత్రికి తరలించారు. గత రాత్రి పరిస్థితి విషమించడంతో అతడు కన్ను మూసాడు. దీనితో బాంగ్లాదేశ్ లో అతని మద్దతు దారులు గత రాత్రి నుండి నేటి శుక్రవారం కూడా తీవ్ర ఆందోనలు హింసాకాండ కొనసాగిస్తున్నారు..
