సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఆంధ్ర ప్రదేశ్ స్టేట్ ఎనర్జీ కన్సర్వెన్సీ అవార్డు (SECA) 2025 ప్రభుత్వం వారు విద్యుత్తు వినియోగంలో పొదుపు పాటించిన రాష్ట్రంలోని 123 మున్సిపాలిటీలలో కరెంట్ బిల్లులు 2022 నుంచి 2025 వరకు వాడిన యూనిట్లను ఆధారంగా స్టేట్ ఎనర్జీ డిపార్ట్మెంట్ వారు సర్వే చేసి మున్సిపల్ కార్పొరేషన్ తరపున రాష్ట్రంలో ఉత్తమ నిర్వహణ క్రింద తిరుపతికి గోల్డ్ అవార్డు, మున్సిపాలిటీలో ఉత్తమ నిర్వహణ క్రింద భీమవరం మున్సిపాలిటీ కి సిల్వర్ అవార్డు ప్రకటించారు. నేడు, శుక్రవారం జరిగిన వీడియో కాన్ఫరెన్స్లో కమిషనర్ అండ్ డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ పి.సంపత్ కుమార్ IAS మరియు రీజినల్ డైరెక్టర్ కం మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ CH.నాగ నరసింహారావు అవార్డు వచ్చిన తిరుపతి కార్పొరేషన్ మరియు భీమవవరం మున్సిపల్ కమిషనర్లకు ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. రేపు అనగా 20-12-2025 తేదీన విజయవాడలో ప్రభుత్వం నుండి భీమవరం మున్సిపాలిటీ తరఫున మున్సిపల్ కమిషనర్ కే రామచంద్ర రెడ్డి మరియు మున్సిపల్ ఇంజనీర్ P. త్రినాధ రావు అవార్డు తీసుకోనున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *