సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: దేశీయ స్టాక్ మార్కెట్ లో గత నాలుగు రోజులు నష్టాలనే చవిచూసిన సెన్సెక్స్ నేడు శుక్రవారం మాత్రం లాభాలతో ఈవారం ముగించింది. డాలర్‌తో పోల్చుకుంటే రూపాయి విలువ 89.27గా కాస్త బలపడటం శుభపరిణామం.( stock market).గత సెషన్ ముగింపు (84, 481)తో పోల్చుకుంటే నేడు శుక్రవారం ఉదయం దాదాపు 250 పాయింట్ల లాభంతో మొదలైన సెన్సెక్స్ రోజంతా లాభాల్లోనే ట్రేడ్ అయింది. ఒక దశలో 85 వేల మార్క్ కూడా దాటి ఇంట్రాడే గరిష్టానికి చేరుకుంది. చివరకు సెన్సెక్స్ 447 పాయింట్ల లాభంతో 84, 929 వద్ద రోజును ముగించింది. మరో వైపు నిఫ్టీ కూడా చివరకు 150 పాయింట్ల లాభంతో 25, 966 వద్ద నిలబడింది. బ్యాంక్ నిఫ్టీ 156 పాయింట్లు లాభపడింది. నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ 718 పాయింట్లు ఆర్జించింది.
