సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చేపలు రొయ్యలు పండించే ఆక్వా రంగంలో వేలకోట్ల విదేశీ మారకద్రవ్యం ఆర్జించడంలో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకు అగ్రస్థానం ఉంది. వీరికి ప్రభుత్వ రంగ ప్రోత్సహం ఉంటె మరింత ఫలితాలు సాధించే అవకాశాలు ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన కరెంట్ చార్జిల సబ్సిడీ విద్యుత్ యూనిట్ రూ.1.50లకే.. కూడా అందరికి అందటం లేదు. ఏలూరు జిల్లాలో 1.49 లక్షల ఎకరాలు, పశ్చిమ గోదావరిలో 1.30 లక్షల ఎకరాలులో ఆక్వా వ్యసాయం జరుగుతుంటే వీరిలో ప్రభుత్వ సబ్సిడీ కోసం సుమారు 50 శాతం రైతులు ముందుకు రాలేక గమనార్హం. వీరిలో సుమారుగా 45 శాతం మందికి మాత్రమే ఈ సబ్సిడీలు అందుతున్నాయని సమాచారం. దానికి కారణం ప్రభుత్వ నిబంధనలు మేరకు ఆక్వా వ్యవసాయదారులు తమ చెరువులకు సంబందించిన అర్జీలు పెట్టుకోవడం లో అడ్డంకులు అధిగమించలేకపోవడమే.. రైతు చెరువుకు ఆధార్ లింకు, వెబ్‌ల్యాండ్ కాకపోవడం, చేరువులు ఎక్కువ మంది బాగస్వామ్యం తో కలసి ఉమ్మడిగా చెయ్యడం చెరువు లీజుదారుల చేతిలో ఉండడం, పట్టాదారు పాసుబుక్ ఆధార్‌కు లింక్ కాకపోవడం. రాష్ట్ర ప్రభుత్వం కూడా నిబంధనలను మరింత సులభతరంగా చేస్తే మరింత మంది ఆక్వా రైతులకు ప్రోత్సహం సబ్సిడీ అందుతుంది, విద్యుత్తూ యూనిట్ కు 7- 9 రూపాయలు చెల్లించే అదనపు భారం తగ్గుటుంది
