సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: కొత్త సంవత్సరం లోకి అడుగుపెడుతున్న నేపథ్యంలో ప్రయాణికులకు రైల్వేశాఖ ఊహించని షాక్ ఇచ్చింది. ఈనెల 26వ తేదినుండి ట్రైన్ టికెట్ల ధరలను పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. ఏ రైళ్లల్లో ఎంతవరకు పెంచారు..అంటే?.. నాన్ ఏసీ కోచుల్లో 500 కిలోమీటర్ల ప్రయాణంపై రూ.10 పెంచుతున్నట్లు రైల్వేశాఖ ప్రకటించింది. అయితే సబర్బన్ రైళ్లల్లో టికెట్ల పెంపు లేదు. ఈ ఛార్జీల పెంపు వల్ల రైల్వేలకు ఒక ఆర్ధిక సంవత్సరంలో రూ.600 కోట్ల అదనపు ఆదాయం లభించనుంది. ఇక సెకండ్ క్లాస్‌లో 215 కిలోమీటర్ల వరకు ప్రయాణంపై టికెట్ల ఎటువంటి పెంపు లేదు. ఇక అంతకు మించి చేసే ప్రయాణాలకు సెకండ్ క్లాస్‌లో కిలోమీటర్‌కు 1 పైసా పెంచారు. ఇక మెయిల్ లేదా ఎక్స్‌ప్రెస్ రైళ్లల్లో నాన్ ఏసీ, ఏసీ క్లాసుల్లో కిలోమీటర్‌కు 2 పైసలు పెంచారు. .
