సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నేడు, సోమవారం ఉదయం భీమవరం లో ఎన్డీఏ కూటమి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మోడీ సుపరిపాలన యాత్ర నేపథ్యంలో భీమవరం పట్టణం అంతటా కాషాయ మయం అయ్యింది. ఈ యాత్ర లో పాల్గొనేందుకు భీమవరం వచ్చిన కేంద్ర విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు, హెలి కాఫ్టర్ లో చేరుకోగా ఆయనకు కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ, ఎమ్మెల్యే అంజిబాబు, టీపీ గూడెం ఎమ్మెల్యే బాలిశెట్టి శ్రీనివాస్ బీజేపీ, జనసేన టీడీపీ నేతలుఘన స్వగతం పలికారు. భీమవరం విసాకోడేరు వంతెన నుండి భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. భారీ పుష్ప మాలతో కేంద్ర మంత్రులతో పాటు రాష్ట్ర మంత్రి సత్య కుమార్ యాదవ్, బిజెపి రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్, జిల్లాలోని ఎమ్మెల్యేలు, నేతలకు స్వాగతం పలికారు. సుమారు 5 కిమీ మేరకు రోడ్డుకు ఇరువైపులా వందలాది పోలిసుల తో భారీ భద్రతా ఏర్పాట్లు చేసారు. జిల్లాలోని ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు కూడా ప్రకాశం చౌక్ మీదుగా ఉండి బైపాస్ రోడ్డు వద్ద ఏర్పాటుచేసిన అటల్ బిహారీ వాజ్ పేయి కాంస్య విగ్రహం పారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇంకా కార్యక్రమం కొనసాగుతుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *