సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: పవిత్ర పుణ్య క్షేత్రం అన్నవరం దేవస్థానంలో విధులు నిర్వహిస్తున్న ఆరుగురు వ్రత పురోహితులను విధుల నుంచి తాత్కాలికంగా తొలగిస్తూ ఈవో త్రినాథరావు తాజగా ఉత్తర్వులు జారీచేశారు. ఈనెల 21న పాలకొల్లు లో రాష్ట్ర మంత్రి నిమ్మల రామానాయుడు సిఫారస్‌తో నిర్వహించిన శ్రీ సత్యనారాణ స్వామి వారి ఉచిత సామూహిక వ్రతాల్లో భక్తుల నుంచి దానాల పేరుతో డబ్బులు డిమాండ్‌ చేశారనే పిర్యాదులు రుజువుకావడంతో ఈనిర్ణయం తీసుకున్నారు. స్పెషల్‌ గ్రేడ్‌ వ్రతపురోహితులు మంథా శ్రీరామ్మూర్తి, ప్రయాగ ఆంజనేయులు, తొయ్యేటి వెంకట నరసింహ హరినాథ సుబ్రహ్మణ్యం, సెకండ్‌గ్రేడ్‌ పురోహితులు పాలంకి సోమేశ్వరరావు, మల్లాది గురుమూర్తి, మూడోగ్రేడ్‌ పురోహితులు మెకరాల సతీష్‌పై తాత్కాలిక తొలగింపు చర్యలు తీసుకున్నారు. దీనిపై వివరణ కోరుతూ వ్రత గుమాస్తా బీ.రాజుకు షోకాజు నోటీసులు జారీ చేసారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *