సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: మంగళగిరిలో సి కే కన్వేషన్ హాల్లో జనసేన పార్టీ “పదవి- బాధ్యత” విస్తృతస్థాయి సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. దీనిలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జనసేన ఎమ్మెల్యేలు, ఇతర స్థానిక సంస్థల ప్రజా పార్టీనిదులతో సమావేశం అయ్యి వారి వారి ప్రాంతాలలో కూటమి లో కానీ, అభివృద్ధి కార్యక్రమాలకు అడ్డుంకులు కానీ, పార్టీలోనే అంతర్గత సమస్యలపై చర్చించారు. అంతేకాదు జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పదవులు చేపట్టిన వారికి దిశ నిర్దేశం చేశారు. కూటమిలో భాగంగా జనసేన పార్టీకి రాష్ట్రం మొత్తం మీద 3,459 నామినేటెడ్ పదవులు వచ్చాయని, మరికొంత మందిని త్వరలో నామినేట్ చేస్తామని పవన్ కల్యాణ్ తెలిపారు. ఈ సమావేశంలో భీమవరం ఎమ్మెల్యే రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ పులపర్తి రామాంజనేయులు పాల్గొనడం గమనార్హం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *