సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఏపీలోని శ్రీహరి కోటలో నేడు, బుధవారం ఉదయం LVM-3 M-6 రాకెట్‌ ప్రయోగం విజయవంతం అయ్యింది. దానితో పాటు అమెరికాకు చెందిన భారీ కమ్యూనికేషన్‌ శాటిలైట్‌ బ్లూ బర్డ్ బ్లాక్-2ను ఈ రాకెట్ విజయవంతంగా నింగిలోకి తీసుకెళ్లింది. తొలిసారిగా ఇంతటి భారీ ఉపగ్రహాన్ని ఇస్రో నింగిలోకి పంపింది. కేవలం 15 నిమిషాల్లోనే బ్లూబర్డ్‌ ప్రయోగం విజయవంతమైంది. ప్రపంచంలో ఎక్కడి నుంచైనా 4G, 5G సేవలను బ్లూ బార్డ్ బ్లాక్-2 అందించగలదు. ఇస్రో చైర్మన్ నారాయణన్ మాట్లాడుతూ.. బాహుబలి ప్రయోగం విజయవంతమైందని హర్షం ప్రకటించారు. . ఎల్‌వీఎం 3 రాకెట్ సిరీస్‌లో ఇది 9వ ప్రయోగం. అతి తక్కువ సమయంలో రాకెట్‌ రూపొందించి విజయవంతం చేశామన్నారు. అతి తక్కువ ఖర్చుతో ప్రపంచంలో అత్యుత్తమ ప్రయోగాల్లో ఇది ఒకటన్నారు. 34 దేశాలకు ఇస్రో సేవలందిస్తోందని అన్నారు. ఇప్పుడు అమెరికా నమ్మకాన్ని కూడా ఇస్రో నిలబెట్టిందన్నారు. ప్రధాని మోడీ ఇస్రో కు అభినందనలు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *