సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం ప్రజలకు సైబర్ నేరాలపై అవగాహన అవసరమని, మోసపూరిత మాటలు, మెసేజ్ లకు రిప్లై ఇవ్వొద్దని రెండో పట్టణ సిఐ కాళీ చరణ్ అన్నారు. మార్నింగ్ కాఫీ క్లబ్ అధ్వర్యంలో నేడు, బుధవారం డిఎన్నార్ కళాశాల రోడ్డులో సైబర్ నేరాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. సైబర్ నేరాలలో చాలామంది అమాయకులు చిక్కుకుంటున్నారని, ఎంతో మంది బాధితులు ఇబ్బందులు పడుతున్నారని సీఐ అన్నారు. ఏపీలో సగటున ప్రతి గంటకు రూ 8.54 లక్షలు దోచుకుంటున్నారన్నారు. క్లబ్ కన్వీనర్ బొండా రాంబాబు, ఓలేటి శ్రీనివాస్ గుప్తా, కారుమూరి సత్యనారాయణ,భట్టిప్రోలు శ్రీనివాసరావు, మాట్లాడుతూ .. ఇటీవలే భీమవరంలో ఒక వృద్ధ దంపతులు ఈ కోవలో చిక్కుకున్నారని, 10 రోజుల్లో రెండో పట్టణ సిఐ కాళీ చరణ్ వారి బృందం ఎంతో చాకచక్యంగా వ్యవహరించి పట్టుకుని 90 శాతం క్యాష్ రికవరీ చేయడం గొప్ప విశేషమన్నారు. అనంతరం సిఐ కాళీ చరణ్ ను సత్కరించారు. కార్యక్రమంలో, కొప్పర్తి అప్పారావు, కొత్త శ్రీనివాస్ కోట్ల నాని, బంగారు ప్రసాద్, తటవర్తి నారాయణ, బొండా హనుమంతరావు,తదితర వాకర్స్ సభ్యులు పాలుగొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *