సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్ : భీమవరం నియోజకవర్గం వీరవాసరం సమీపంలో ఉన్న తులసి ఫంక్షన్ హాల్ నందు ఏపీ రాష్ట్ర కార్మిక ESI, వైద్య భీమా, ఫ్యాక్టరీలు, బాయిలర్లు శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ సమక్షంలో నూతనంగా SAF శెట్టిబలిజ యాక్షన్ ఫోర్స్ సంబంధించి మండల కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది…దీనిలో భాగంగా SAF మండల గౌరవఅధ్యక్షులుగా కడలి శ్రీరాములు ఎంపిక కాగా, SAF వీరవాసరం మండల అధ్యక్షులుగా వీరవల్లి ప్రవీణ్ కుమార్ ను ఎంపిక చేసుకోవడం జరిగిందీ. నిజానికి ఈ సంస్థ వ్యవస్థాపకులు ప్రస్తుత కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ కావడంతో ఆయన అడ్జక్షులు వీరవల్లి ప్రవీణ్ కు శాలువా కప్పి సత్కరించి అభినందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో బీసీ జాతీయ అధ్యక్షులు, వీరవల్లి శ్రీనివాస్ మరియు .ఆర్ కృష్ణయ్య జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి కోడె యుగంధర్ (భీమవరం)ప్రముఖ న్యాయవాది పస్తుల సింహాచలం, గోపాలపురం టీడీపీ పరిశీలకులు వీరవల్లి శ్రీనివాస్, చోల్లంగి వెంకటరమణ, శెట్టిబలిజ యువసేన అధ్యక్షులు గుబ్బల రాజేష్, ట్రెజరర్ గుత్తుల వాసు, బొక్కా సూర్యనారాయణ, భీమవరం,టి.డి.పి, డివిడి ప్రసాద్, మల్లుల పాటియ్య, పాలా నాగరాజు మరియు శెట్టిబలిజ సంఘాల గ్రామ పెద్దలు, యువత పెద్ద ఎత్తున పాల్గొన్నారు……
