సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం స్థానిక మెంటేవారి తోటలోని కొయ్యవారి వీధిలో శ్రీ విజయ కనకదుర్గ ఆలయంలో పలు కార్యక్రమాలతో ఘనంగా నిర్వహించనున్న దసరా శరన్న నవరాత్రి మహోత్సవాలకు సంబందించిన బ్రోచర్ ను మాజీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ నేడు, ఆదివారం తన నివాసం లో దేవాలయ నిర్వాహకుల కోరిక మేరకు విడుదల చేశారు. ఆ వేడుకలకు శ్రీ అమ్మవారి భక్తుడిగా హాజరు అవుతానన్నారు.ఈనెల 11 నుండి 20వరకు వేడుకలు తదుపరి 21వ తేదీన శ్రీ అమ్మవారి నగరోత్సవం మరియు 22వ తేదీన భారీ అన్నసమారాధన నిర్వహిస్తామని నిర్వాహకులు తెలిపారు.
