సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: జపాన్ వేదికగా జరిగిన ఏషియన్ గేమ్స్ 2026 నేడు, ఆదివారం ఘనంగా ముగిసాయి. ఈ ఆసియా దేశాల క్రీడలలో భారత్ 4వ స్థానంతో తొలిసారి తన అత్యుత్తమ ప్రదర్శన చెయ్యడం గమనార్హం. . భారత క్రీడాకారులు అద్భుత ప్రదర్శనతో 21 స్వర్ణ పతకాలు కైవసం చేసుకున్నారు. భారత్ లో అత్యంత ప్రాధాన్యం ఉన్న క్రికెట్, కబడ్డీ, హాకీలలో పురుషుల, మహిళల జట్లు డబుల్ స్వర్ణాలు సాధించి రికార్డు సృష్టించగా, ఆర్చరీ, షూటింగ్, బాక్సింగ్, రెజ్లింగ్, గోల్ఫ్‌లలో భారత అథ్లెట్లు పసిడి జెండాను ఎగురవేశారు.ఈ క్రీడల్లో భారత్ మొత్తంగా 85 పతకాలతో అద్భుత ప్రదర్శన చేసింది. ఇందులో 21 స్వర్ణాలు, 27 రజతాలు, 38 కాంస్యాలు ఉన్నాయి. ఓవరాల్‌గా 1983 ఢిల్లీ లో జరిగిన ఆసియా క్రీడల తరువాత ఇది భారత్‌‌కు రెండో అత్యుత్తమ ఆసియాడ్ ప్రదర్శనగా నిలిచింది. హాకీ, కబడ్డీ, క్రికెట్‌లలో భారత జట్లు డబుల్ స్వర్ణాలు గెలిచాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *