సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్:హైందన సనాతన ధర్మాన్ని కాపాడుకోవడం ప్రతి హిందువు కనీస ధర్మమని శృంగవృక్షం దత్తపీఠం 5వ పీఠాధిపతి శ్రీసాయి దత్త నాగానంద సరస్వతి స్వామీజీ అన్నారు. భీమవరం కృష్ణదేవరాయ కళ్యాణ మండలంలో నేడు, గురువారం హిందు సమ్మేళనం నిర్వహించారు. ప్రస్తుతం హిందువులపై జరుగుతున్న దాడులపై సమాజం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని, ఆధ్యాత్మికతే హిందూ సమాజానికి బలమని ఐక్యతకు మూలమన్నారు. భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు మాట్లాడుతూ.. హిందూ ధర్మానికి ఐకమత్యం ఎంతో ముఖ్యమని, భక్తి భావంతో దేశ సమైక్యత కోసం ప్రతిఒక్కరు పాటు పడాలన్నారు. హిందూ సమాజాన్ని చైతన్యపరచి, హైందవ ధర్మ పరిరక్షణకు ప్రతి హిందువు కృషి చేయాలన్నారు. కార్యక్రమ కార్యదర్శి గొంతిన శ్రీనివాస్, కోశాధికారి రావూరి అనంత్, అడ్డగర్ల ప్రభాకర్ గాంధీ సభ్యులు పాల్గొన్నారు.
